ప్రేమికుల రోజున ప్రేమ కోసం కిరాతకం!

Thursday, February 15th, 2018, 01:10:45 PM IST

బంధాలు అనుబంధాలకు తిలోదకాలిస్తున్న ఈ రోజుల్లో ఒక అమ్మాయి ప్రేమ కోసం ప్రాణ స్నేహితుడిని హతమార్చిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపుర తాలూకా కంచిగనాళ ప్రాంతానికి చెందిన హరీశ్‌ కుమార్‌, సంతోష్‌ ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అనూహ్యంగా వీరు అదే ఊరికి చెందిన ఒక యువతిని ఒకరికి తెలియకుండా మరొకరు ఇష్టపడ్డారు. చివరకు ఆమె వారిలో హరీష్ ను ఇష్టపడటం జరిగింది. అయితే అది సంతోష్ కు నచ్చలేదు. ఆ యువతి హరీశ్‌ను ఇష్టపడుతోందని, వారిద్దరూ ప్రేమికుల దినోత్సవం జరుపుకొనేందుకు సన్నద్ధం అవుతున్నారని సంతోష్‌కు తెలిసింది. అయితే ఈ విషయమై స్నేహితుడు అని కూడా చూడకుండా హరీశ్‌తో వాగ్వివాదానికి దిగాడు ఆ గొడవ కాస్త పెద్దదయి చివరకి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా హరీష్ ని పొడిచి పరారయ్యాడు. వెంటనే గ్రామస్థులు హరీష్ని చికిత్స నిమిత్తం దొడ్డబల్లాపుర ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాదాని తెలుస్తోంది. ఘటన విషయమై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సంతోష్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది….