ట్రంప్ ని భరించడం నా వల్ల కాదన్న వైట్ హౌస్ మహిళా ఉద్యోగి..!

Sunday, February 26th, 2017, 08:05:24 PM IST


ట్రంప్ విధానాలు వైట్ హౌస్ లో పనిచేసే ఉద్యోగులకే చిరాకు పుట్టిస్తున్నాయి. ట్రంప్ విధానాలు నచ్చక వైట్ హౌస్ లో ఉద్యోగినిగా పనిచేస్తున్న ముస్లిం మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. బంగ్లాదేశ్ మూలాలు ఉన్న రుమానా అహ్మద్ అనే మహిళను 2011లో వైట్ హౌస్ లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పనిచేయడానికి ఎంపిక చేశారు. తాజాగా ఆమె ‘ది అట్లాంటిక్’ అనే పత్రికతో తన అభిప్రాయాలను తెలియజేసింది.

ట్రంప్ ముస్లిం దేశాలపై నిషేధం విధించిన 8 వ రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆ మహిళ తెలిపింది.నేను హజీబ్ ధరించే ఏకైక మహిళను.నాటి ఒబామా కార్యవర్గంలో నన్ను వారిలో కలుపుకుని వెళ్లారు. కానీ ట్రంప్ వచ్చాక మమ్మల్ని అవమానిస్తున్నారు అని రుమానా తెలిపింది. ట్రంప్ ముస్లింలపై నిషేధం విధించాక 8 రోజులు విధులు నిర్వహించాను. చివరిరోజు తాను రాజీనామా చేస్తున్నట్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజర్ మిచెల్ కు సమాచారం ఇచ్చాను. ఆయన మొదట ఆశ్చర్యపోయినా ఆ తరువాత ఎందుకు అనికూడా అడగలేదు. అవమాన భారంతో మా దేశ చారిత్రాత్మక భవనం వీడానని ఆ మహిళా తెలిపింది. తాను అమెరికన్ గానే, ముస్లిం గానే ఉంటానని రుమానా తెలిపింది.