చంద్రబాబు ఒక అబద్దాల కోరు..! మహమ్మదీయులు ఫైర్.

Wednesday, September 12th, 2018, 01:51:13 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ యొక్క పాదయాత్ర ఇప్పుడు విశాఖ జిల్లాలో నడుస్తున్నది అని తెలిసిన విషయమే ఐతే. ఈ రోజు పాదయాత్ర నిమిత్తం చిన్న గదిలి చేరుకున్నారు ఇందులో భాగంగానే అక్కడి మహమ్మదీయులతో ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు విశాఖ జిల్లా ముంచే కాడకుండా అనంతపురం నుంచి కూడా వందలాదిగా మహమ్మదీయు చేరుకున్నారు..

అక్కడికి చేరుకున్న మహమ్మదీయులు ఈ నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలన కోసం మాట్లాడుతూ తాను ఎన్నికల ముందు మహమ్మదీయులుకు ఎన్నో చేస్తానని అబద్దపు హామీలు ఇచ్చారని కానీ వారు అధికారం లోకి వచ్చాక వారిని అసలు పట్టించుకోలేదు అని,ఆయన చెప్పేవి అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు.స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా సరే ఒక్క ముస్లిం మైనార్టీ మంత్రి లేనటువంటి ప్రభుత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రం లోనే ఉంది అని మండిపడ్డారు. మొన్న వారు చేపట్టిన నారా హమారా కార్యక్రమంలో వారి సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన ముస్లిం సోదరులు మీద అన్యాయంగా దౌర్జన్యం చేయించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది అని ధ్వజమెత్తారు..

  •  
  •  
  •  
  •  

Comments