లెజెండ్ మనసులోని మాటలు : చిరంజీవి సినిమా హిట్ అయివుంటే నా కెరీర్ వేరేలా ఉండేది..!

Wednesday, October 5th, 2016, 05:33:42 PM IST


ముత్యాల ముగ్గు చిత్రంలో నటించిన సంగీత తెలంగాణా ఆడపడుచు.నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఆమె కొనసాగుతోంది.తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె అనేక విషయాలు వెల్లడించింది.

* మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీ కి దగ్గరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంగీత అన్నారు.
* తనది వరంగల్ అని తెలిపారు. తాను చిన్నతనంలోనే భారత నాట్యం నేర్చుకున్నానని అన్నారు.
* యాడ్ ఫొటోస్ తీసే ఓ ఫోటోగ్రాఫర్ తన ఫోటోలు తీసి బాపు, విశ్వనాధ్ లకు పంపారని, దానితో తనకు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు.తనకు మొదట అవకాశం వచ్చిన చిత్రం తీర్పు అని, కానీ మొదట విడుదలైన చిత్రం మాత్రం ముత్యాల ముగ్గు అని తెలిపారు.
* తనకు తీర్పు చిత్రానికి అవకాశం రాక ముందు రామానాయుడి గారిని కలిశానని ఆమె తెలిపింది.నీది చాల చిన్నవయసు సినిమాలో నటించాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగు అని రామానాయుడు ఆమె తో అన్నట్లు తెలిపింది.
* ముత్యాలముగ్గు చిత్ర సమయంలో బాపు గారు తనతో ఎక్కువగా మాట్లాడేవారు కాదని ఆమె అన్నారు.కెమెరా వంక ఎక్కువగా చూడొద్దు అనిచెప్పేరు అని సంగీత అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
* తనకు అప్పట్లో సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే తన కెరీర్ ను సరిగా మలచుకోలేక పోయానని అన్నారు. తెలుసుకునేసరికి లేట్ అయిందని అన్నారు.
* తనకు టిఆర్ ఎస్ పార్టీలో చేరాలని ఉన్న తన కోరికను బయట పెట్టారు.చిత్ర పరిశ్రమ కోసం పనిచేయాలని ఉందని ఆమె అన్నారు.
* తాను మెగాస్టార్ చిరంజీవితో నకిలీ మనిషి చిత్రంలో నటించానని ఆమె అన్నారు. ఆచిత్రం సరిగా ఆడలేదని, ఆ చిత్రం విజయం సాధించి ఉంటె తన కెరీర్ వేరేలా ఉండేదని సంగీత అన్నారు.
* తనది ప్రేమ వివాహం అని సంగీత తెలిపింది. తన భర్త ఒక తమిళుడు అని ఆమె తెలిపింది.తను తమిళంలో సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారని ఒక తమిళ తెలుగు చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు సంగీత తెలిపింది.
* తనకు సరిపోయే పాత్రలు వస్తే చేస్తానని, ప్రభుత్వం ద్వారా ఏదైనా సేవ చేయాలనే కోరిక ఉన్నట్లు సంగీత అన్నారు.