నా యుద్ధం రాక్షసులతో, మోసగాళ్ళతో… జగన్ సంచలనం

Monday, February 11th, 2019, 04:03:50 PM IST


వైసీపీ అధినేత జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకు పడ్డాడు. టీడీపీ ప్రభుత్వ నాయకులపైనా మరియు ప్రభుత్వ పైన జగన్ సంచలనాత్మకమైన వాఖ్యలు చేశారు… నేడు నేను ప్రజలకోసం తీవ్రమైన చేస్తున్నానని, అదికూడా రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. నేడు అనంతపురంలో నిర్వహించిన వైసీపీ శంఖారావం సభలో మాట్లాడిన ఆయన ఇప్పటికి కూడా ప్రజలు పడుతూన్న కష్టాలని లేవనెత్తారు. గత నాలుగేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక చేస్తానని హామీ ఇచ్చిన పనుల్లో కనీసం ఒక్కటి కూడా సరిగా చేయలేదని, అంతేకాకుండా తాను అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా మరియు సామాజికంగా నిలదొక్కుకునేలాగా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ప్రస్తుత సీఎం చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని ఎన్నో మోసపూరితమైన పాల్పడుతున్నాడని, మా పార్టీ కి ఉన్నవారందరిని కూడా ఓటర్ లిస్టు నుండి తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 60 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని, దయచేసి అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జగన్ సూచించారు. దయచేసి డబ్బుతీసుకుని ఓటు వేసే విధానానికి ఇక స్వస్తి పలకాలని జగన్ ప్రజలందరికి కూడా సూచించారు.