టీడీపీకి రాజీనామా.. తేల్చేసిన మంత్రి అఖిల‌ప్రియ‌..?

Friday, January 11th, 2019, 03:30:49 PM IST

ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియా రోజురోజుకు చెలరేగిపోతుంది. ఆమె తనకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపినప్పటినుండి పెద్ద చర్చ కి దారి తీసింది. ఈ దెబ్బతో అఖిల ప్రియా టీడీపీ నుండి విడిపోవడం ఖాయమని అందరు అనుకున్నారు కానీ ఈ విషయం మీద స్పందించిన అఖిలప్రియ అలంటి ఆలోచనలు తనకు లేవని, జీవితంలోకూడా టీడీపీ ని వదలబోనని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధికి పయనం సాగిస్తానని ప్రకటించారు. దయచేసి నా మీద వచ్చే ఈ చెడు వాఖ్యాలను నమ్మకండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపేయాలని అఖిలప్రియ ప్రజలను కోరారు.

అంతేకాకుండా మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లనే ఆళ్లగడ్డకు నిల్లు వచ్చాయని, మన రాష్ట్రము బాగుపడటానికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. మల్లి ఆళ్లగడ్డలో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు కి కానుకగా ఇస్తానని అఖిలప్రియ అన్నారు. బతికినంత కాలం ప్రజాసేవ చేస్తూనే ఉంటానని అదికూడా టీడీపీ తో కలిసే ఉంటానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.