నా కుడి భుజమే నా బలం… కెసిఆర్

Tuesday, November 20th, 2018, 11:40:56 PM IST


ఎన్నికలలో ఎవరి పంథాలో వారు వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హుజురాబాద్ జిల్లాలో జరిగిన బారి బహిరంగ సభలో కెసిఆర్ గారు ఉద్వేగ పూర్వకంగా ప్రసంగించారు కెసిఆర్. ఈ నియోజకవర్గం లో మళ్ళి తెరాస అధికారం లోకి రావడం ఖాయమని, ఈటెల రాజేందర్ మల్లి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేస్తాడని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ నా కుడి బుజం లాంటివాడని, ఆ కుడి బుజం బలంగా ఉండాలంటే ఇక్కడి ఓటర్లు లక్ష ఓట్ల మెజారిటీ కి తగ్గకుండా గెలిపించాలని కెసిఆర్ ప్రసంగించారు.
ఈరోజు ఉదయమే తనకి సర్వ్ రిపోర్ట్ అందిందని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ఇక్కడ 80 శాతం ఓట్లు ఈటెల రాజేందర్ కే పడతాయని తెలిసిందన్నారు. ఇది తాను చెప్పే కథ కాదని, సర్వే ఇచ్చిన రిపోర్ట్ అని, మెజారిటీ లక్ష ఓట్లకు అసలే తగ్గకుండా గెలిపించాలని, ఆ చైతన్యాన్ని ఇక్కడి నియోజక వర్గ ప్రజలు చూపించాలని కోరారు.తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి నేడు రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పటివరకు అభివృద్ధి విషయంలో చాల గొప్పగా పని చేసిన వ్యక్తి ఈటెల అని తెలిపారు. ఒక బలహీన వర్గం నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు ఈటెల రాజేందర్ అని, మీరు ఏంతో అదృష్టం చేసుకుంటే కానీ మీకు ఇలాంటి నాయకుడు దొరకడని కెసిఆర్ ప్రసంగించారు. మళ్ళీ తెలంగాణా లో తెరాస జెండా ఎగరడం ఖాయమని కెసిఆర్ హర్షం వ్యక్తం చేసారు.