నా సంపద అంత తక్కువ కాదు: సౌదీ ప్రిన్స్ ఫైర్

Saturday, June 8th, 2013, 03:20:26 PM IST


ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రపంచ సంపన్నుల జాబితాను ప్రతి ఏటా విడుదల చేస్తుంది. అయితే ఈ సారి ఆ పత్రిక సంపన్న జాబితా విషయంలో ఇరుక్కుంది. ‘ఫోర్బ్స్’పై సౌదీ అరేబియా రాకుమారుడు అల్వాలీద్ బిన్ తలాల్ కోర్టుకెక్కాడు. తన సంపద 3000 కోట్ల డాలర్లు అయితే, దానిని ఫోర్బ్స్ 1,000 కోట్లు తగ్గించి కేవలం 2,000 కోట్ల డాలర్లుగానే ప్రకటించిందని లండన్ హైకోర్టులో అల్వాలీద్ పరువు నష్టం దావా వేశాడు.

మార్చి 4న వెలువడ్డ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అల్వాలీద్ 26వ స్థానంలో ఉన్నాడు. ఆ వెంటనే సౌదీ రాజ కుటుంబం ఇది సరైన డేటా కాదంటూ ప్రకటన జారీ చేసింది. తాజాగా కోర్టులో వేసిన దావాలోనూ ఇదే విషయం తలాల్ చెప్పుకొచ్చాడు. ఫోర్బ్స్ పత్రిక ఎడిటర్ రాండెల్ లేన్, ఇద్దరు జర్నలిస్టుల పేర్లను అందులో ప్రస్తావించాడు. మరి ఈ వివాదంపై ‘ఫోర్బ్స్’ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.