కనిపించకుండా పోయిన మహిళా ఎమ్మెల్యే .. శశికళ ఏం చేసింది..?

Friday, February 10th, 2017, 11:00:22 AM IST


నా భార్య కనిపించడం లేదు.. ఆమె ఎక్కడికెళ్లిందో ఏమైపోయిందో తెలియడం లేదని, ఆందోళనగా ఉందని ఓ భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. తన భార్య ఎమ్మెల్యే అని తెలపడం విశేషం. తమిళనాడులో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలుగా చెప్పబడుతున్న వారందరిని ఓ రహస్య ప్రదేశం లో ఉంచిన విషయం తెలిసిందే. వారికీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వారివద్ద నుంచి మొబైల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో కేవలం ఆ మహిళా ఎమ్మెల్యే భర్తే కాదు, చాలా మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు.

కాగా శశికళ క్యాంపు నుంచి 22 మంది ఎమ్మెల్యేలు తప్పించుకుని పన్నీర్ వర్గం చేరినల్టు తెలుస్తోంది.కాగా ఆ 22 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పన్నీర్ వర్గం చెబుతున్నా వారి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. గవర్నర్ ముందు బల ప్రదర్శన జరిగే వరకు వారి ఆచూకీ వివరాలను రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారట. ఇప్పటికే పన్నీర్ సెల్వం, శశికళలు గవర్నర్ విద్యాసాగర్ రావు ని కలసి తమకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. దీనితో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఆసక్తిగా మారింది.