త్రివిక్రమ్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన.. మైత్రిమూవీ మేక‌ర్స్..?

Monday, November 19th, 2018, 10:30:46 AM IST

టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ అనేక హిట్ చిత్రాల‌కు క‌థ‌, మాట‌లు అందించారు. అతి త‌క్కువ కాలంలోనే స్టార్ రైట‌ర్‌గా ఎదిగిన త్రివిక్ర‌మ్.. నువ్వే నేవ్వే చిత్రంతో మెగా ఫోన్ ప‌ట్టుకున్నారు. ఇక డైరెక్ట‌ర్‌గా వ‌రుస‌గా విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్‌కు.. అజ్ఞాత‌వాసి చిత్రం అట్ట‌ర్ ప్లాప్ అయ్యి.. ఊహించ‌ని షాక్ ఇచ్చింది.

ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రం కూడా యావ‌రేజ్ కావ‌డంతో త్రివిక్ర‌మ్ స్టామినా పై సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో ఓ సినిమా చేయ‌డం కోసం, త్రివిక్ర‌మ్ మైత్రి మూవీ మేక‌ర్స్ నుండి ఆడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే త్రివిక్ర‌మ్ కొంత కాలంగా హారిక‌- హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లోనే చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.

అయితే తాజాగా అల్లు అర్జున్‌తో చేయ‌బోయే సినిమాను త‌మ బ్యాన‌ర్‌లోనే చేయాల‌ని మైత్రీ మూవీస్ నిర్మాత‌లు అడిగార‌ని స‌మాచారం. దీంతో మైత్రీ నుండి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల‌ని భావించిన త్రివిక్ర‌మ్.. నిర్మాత రాధాకృష్ణతో మైత్రీ నిర్మాత‌ల‌కి తీసుకున్న ఆడ్వాన్స్ ఇప్పించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. తాము అడ్వాన్స్ ఇచ్చింది సినిమా చేయ‌డానికని.. తిరిగి తీసుకోవ‌డానికి కాద‌ని.. మీకు ప్రాజెక్ట్ చేయ‌డం ఇష్టం లేక‌పోతే, తీసుకున్న అడ్వాన్స్‌ వ‌డ్డీతో స‌హా ఇవ్వాల‌ని మైత్రీ మూవీస్ నిర్మాత‌లు అన్నార‌ట‌. దీంతో షాక్ తిన్న త్రివిక్ర‌మ్ త‌న తర్వాత చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో చేస్తారో,లేక హారిక‌-హ‌సిని బ్యాన‌ర్‌లోనే చేస్తారో చూడాలని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.