యూఎస్ ప్రీమియర్ షో టాక్: నా పేరు సూర్య ఎలా ఉందంటే..?

Friday, May 4th, 2018, 06:41:32 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన నా పేరు సూర్య సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే యూఎస్ లో ముందే సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగిందని చెప్పాలి. బన్నీ మొదట అతి ఆగ్రహ స్వభావం కలిగిన ఒక సైనికుడి పాత్రలో తన పాత్రను ప్రజెంట్ చేస్తాడు. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రస్తుతం.. కొంచెం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కథ సాగుతుంది. అర్జున్ బన్నీ తండ్రిగా ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ కథ వీక్ పాయింట్.

ఇక ఎంచుకున్న ఎమోషన్ కథ ప్రజెంటేషన్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అలాగే యాక్షన్ సీన్స్ సినిమాలో ఓ విధంగా ఆకట్టుకుంటాయి. ఆర్మీ లో పనిష్మెంట్స్ సీన్స్ తరువాత కథ సడన్ గా వేరే జానర్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఫ్యామిలీ లవ్ సీన్స్ అన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చెసినా ఆ సీన్స్ ఆకట్టుకొని విధంగా ఉన్నాయి. హీరో పాత్ర కనెక్ట్ అయితేనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అసలు ఆ పాయింట్ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. మొదట్లో కొన్ని సన్నివేశాల తరువాత సినిమా కథ చాలా స్లో అయినట్టు అనిపిస్తుంటుంది. మధ్యలో ఒక్కోసారి తలపట్టుకుని విధంగా సీన్స్ ఉంటాయి . అసలు ఇది బన్నీ సినిమానేనా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు సినిమా నడిచిన విధానం కూడా యావరేజే. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉందని చెప్పవచ్చు. అయితే అలా మెప్పించిన మరో నిమిషానికే సినిమా డల్ గా సాగుతుంది.

సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో సాంగ్ కొంచెం బెటర్ చెప్పాలి. అందులో బన్నీ క్యాప్ ట్రిక్స్ మెప్పిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు కొంచెం రోటిన్ గా అనిపిస్తాయి. అసలైన ఇంటర్వెల్ పాయింట్ సినిమా సెకండ్ హాఫ్ పై పెద్దగా ఆసక్తిని పెంచదు. బన్నీ నుంచి వచ్చిన నా పేరు సూర్యపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేదు. మేజర్ గా కథ కథనంలో బలం లేకపోవడం వీక్ పాయింట్. ఒక కథ రచయిత అయిన వక్కంతం వంశీ ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడు అనేది షాకింగ్ విషయం. పోనీ ప్రజెంటేషన్ అయినా ఓకేనా అనుకుంటే అందులో అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు. యూఎస్ టాక్ ప్రకారం సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు అని అనిపిస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఏ వర్గాన్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.