బిగ్ బ్రేకింగ్.. ఏపీ కాంగ్రెస్‌కు మెగా షాక్ ఇచ్చిన.. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్..!

Thursday, October 11th, 2018, 12:40:27 PM IST

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అడ్డ‌దిడ్డంగా విడ‌దీసి ఏపీ ప్ర‌జ‌ల ఆగ్రాహానికి గురైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అక్క‌డ కోలుకుంటుంది. అయితే తాజాగా ఏపీలో కాంగ్రెస్‌కు ఊహించ‌ని విధ‌గా పెద్ద దెబ్బేత‌గిలింది. ఏపీ మాజీ స్పీక‌ర్ కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

ఇక గ‌తంలో ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడే నాదెండ్ల మనోహర్. అయితే కాంగ్రెస్ అధినాయ‌కుల‌తో మంచి సంబంధాలు కొన‌సాగించినా.. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన కమిటీల్లో నాదెండ్ల‌కు ఎఐసీసీలో స్థానం దక్కలేదు. దీంతో ఇదే మంచి స‌మ‌యంగా భావించిన నాదెండ్ల మనోహ‌న్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలేఖ‌ను ఇచ్చి కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చారు.

ఇక నాదెండ్ల రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి చ‌ర్చ‌లు రాగా.. ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం ఉంది. ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో నాదెండ్ల జ‌న‌సేన త‌ర‌పున బ‌రిలోకి దిగ‌నున్నార‌ని స‌మాచారం. అందులో భాగంగానే ఇదే ఏడాది జూన్‌లోనే విజ‌య‌వాడ‌లో నాదెండ్ల జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మావేశం అయ్యారని స‌మాచారం. నాటి స‌మావేశంలో ప‌వ‌న్‌తో రాష్ట్ర విభ‌జ‌న తర్వాత జ‌రిగిన పరిస్థితుల పై చ‌ర్చించుకొని ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఇక ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో.. కాంగ్రెస్‌తో ఉంటే ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చించుకున్న త‌ర్వాతే ఆయ‌న రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచాం. ఏది ఏమైనా నాదెండ్ల కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.