నిహారిక పెళ్లి.. టైమ్ చెప్పిన నాగ‌బాబు..!

Monday, February 11th, 2019, 11:15:23 AM IST

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ మ‌ధ్య యూట్యూబ్ చాన‌ల్ ఓపెన్ చేసి వ‌రుస‌గా ర‌చ్చ వీడియోలు పోస్టు చేస్తూ.. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సినీ న‌టుడు బాల‌కృష్ణ పై వ్యాఖ్య‌లు చేసి గేమ్ మొద‌లు పెట్టిన నాగ‌బాబు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌, ఏబీఎన్ చాన‌ల్ పై సెటైర్స్ వేస్తూ.. నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న నాగబాబు, తాజాగా ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంట‌ర్వ్యూలో భాగంగా అనేక అంశాల పై చ‌ర్చించిన నాగ‌బాబు, నిహారిక పెళ్లి విష‌యం పై కూడా ఆశ‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు పెళ్లి విష‌యంలో నిహారిక‌కు టైమ్ ఇచ్చామ‌ని, కులంతో సంబంధం లేకుండా మంచి అబ్బాయి అయితే చాల‌ని పెళ్లి చేయ‌డానికి సిధ్ధింగా ఉన్నామ‌ని నాగ‌బాబు అన్నారు. నిహారిక‌కు న‌టించ‌డం అంటే ఇష్ట‌మ‌ని, ఇంట్లోవాళ్ళంతా క‌లిసి చ‌ర్చింకున్న‌ప్పుడు నిహారికి న‌టిస్తాన‌ని గ‌ట్టిగా చెప్పింద‌ని.. అందుకే త‌న కోరిక తీర్చడానికి, న‌టించేందుకు ఒప్పుకున్నామ‌ని నాగ‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ఆమె వెబ్‌సిరీస్‌లు చేస్తుంద‌ని, త‌మ కాపు కులం నుండి అయినా, వేరే కులంలో అయినా మంచి అబ్బాయి దొరికే త్వ‌ర‌లోనే పెళ్లి చేస్తామ‌ని నాగ‌బాబు స్ప‌ష్టం చేశారు.