వచ్చే ఎన్నికల్లో సైకిల్ ని “తొక్కేయ్యండి”..నాగబాబు మరోసారి.!

Tuesday, February 12th, 2019, 01:04:47 AM IST


గత కొంత కాలం నుంచి మెగా బ్రదర్ నాగబాబు కొన్ని పొలిటికల్ సెటైరికల్ వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య కొన్ని పచ్చ ఛానెళ్ల పైన చేసిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి.అలాగే ఇప్పుడు కూడా నాగబాబు మరో సెటైరికల్ వీడియోని ఒకటి వదిలారు.

దీనిలో టార్గెట్ గా మాత్రం సైకిల్ ని తీసుకున్నారు.ఇద్దరు చిన్న పిల్లలు సైకిల్ ని తొక్కుతుంటారు.కాకపోతే ఒకరు కూర్చొని తొక్కితే మరొకరు సైకిల్ ని పడుకోబెట్టి తొక్కుతారు,ఒకరిని సైకిల్ ఎందుకు తొక్కుతున్నావ్ అని అంటే ఆరోగ్యం కాపాడటానికి అని అంటాడు..మరో పిల్లాడు నువ్వెందుకు ఇలా సైకిల్ తొక్కుతున్నావ్ అని అడిగితే..ఆ పిల్లడు ఏమన్నాడో ఈ కింది వీడియోలో మీరే చూడండి.