మీడియాపై ఎలాంటి నిషేధం లేదు.. ఆయన ఆవేశంలో అన్నారు : నాగబాబు

Wednesday, May 2nd, 2018, 09:49:12 AM IST

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో హీరోల అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ మీటింగ్ ప్రముఖ ఛానెల్స్ పై నిషేధాన్ని విధిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సినీ నటుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎదో ఆవేశంలో మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు గాని ఎలాంటి నిషేధం విధించడం లేదని తెలిపారు. అలాగే తామేమి పేదరాయుళ్లం కాదని నాగబాబు వివరించారు.

ఈ శుక్రవారం నా పేరు సూర్య రిలీజ్ అవుతున్న సందర్బంగా నాగ బాబు ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి చెప్పారు. కేవలం సినీ పరిశ్రమ మంచి కోసం ఏం చేయాలన్న విషయంపైనే చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇక లక్షల్లో ఉండే అభిమానులను మేము చాలా కంట్రోల్ చేస్తున్నామని అయితే కొందరు మెగా ఫ్యామిలీ లైమ్ లైట్ లో ఉండడానికి విమర్శలు చేస్తున్నట్లు చెబుతూ.. కేవలం వారినే అభిమానులు ఆవేశంలో తీరుతున్నారని చెప్పారు. అంతే కాకుండా అభిమానులను కంట్రోల్ చేయడం తప్ప మాకేమి పనులు లేవనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇక నా పేరు సూర్య శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా నిర్మించారు.

Comments