జనసేన పార్టీలోకి నాగబాబు..దెందులూరు నుంచి పోటీ.?

Wednesday, September 26th, 2018, 03:46:40 PM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలోని భాగంగా ఏలూరులో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే,అందులో భాగంగానే నిన్న అక్కడి దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యొక్క దురుసు ప్రవర్తన పట్ల కాస్త శాంతంగానే చురకలంటించారు,ఇంటికి పిలిపించి మరీ దళిత సోదరులని కులం పేరుతో దూషించారని వారు పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించగా,పవన్ చంద్రబాబు గారికి తమ ఎమ్మెల్యేని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు క్షేత్ర స్థాయిలో తిరగబడితే ఎలా ఉంటుందో మీరు చూస్తారని హెచ్చరించారు.

దీనికి గాను చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఘాటు గానే సమాధానం ఇచ్చారు.పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే దెందులూరు నుంచి తనకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలవమని సవాలు విసిరారు.దీనికి గాను పవన్ కళ్యాణ్ సవాళ్లు విసురుకోవడానికి ఇదేమి సినిమా కాదని,వారి యొక్క అన్ని అక్రమాలను కోసం సాయంత్రం జరగబోయే మీటింగులో మాట్లాడుతానని,తెలిపారు.అయితే దెందులూరు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగేంద్ర బాబు గారు చింతమనేని ప్రభాకర్ కు పోటీగా నిలిపేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని,అక్కడి ప్రాంత ప్రజలు అంటున్నారు,అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా నాగేంద్ర బాబు గారిని దెందులూరు నుంచి పోటీకి నిలిపేందుకు జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా మంతనాలు జరుపుతున్న ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.