ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్న నాగిని నటి…

Thursday, December 6th, 2018, 09:37:49 PM IST

తెలుగు సీరియళ్ళలో నాగిని ది ఒక ప్రత్యేక ధోరణి. ‘నాగిని’ ధారావాహికతో బుల్లితెరపై ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్‌, ఒక్కసారిగా ఫేమ్ అయిపోయింది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తోనే నటించే ఛాన్స్‌ కొట్టేసింది. వీరిద్దరూ నటించిన ‘గోల్డ్‌’ మంచి విజయం సాధించింది. అ తర్వాత అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అక్కినేని నాగార్జున వంటి దిగ్గజాలు నటిస్తున్న ‘బ్రహ్రాస్త్ర’ లోనూ అవకాశం దక్కించుకుంది. ఈ లెక్క ప్రకారం చుస్తే అదృష్టం తన వెంటే ఉందని చెప్పుకోవాలి. మౌని రాయి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కన్నడ నటుడు యాష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజిఎఫ్” చిత్రం లో మౌని ఒక ప్రత్యేక గీతంలో నటించనుంది.

ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం 80ల కాలం నాటి పాటను రీమేక్ చేయనున్నారు. ఇప్పుడు ఈ పాటలో మౌనీ రాయ్‌ నర్తించనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తొలి ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. రెండు రోజుల క్రితం మరో ట్రైలర్‌నూ విడుదల చేశారు. ఇప్పటివరకు ఎన్నడూ రానటువంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రం నిర్మితమవుతుండడంతో, ఈ చిత్రం పై బారి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, జపనీస్‌, చైనీస్‌ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.