నాగాలాండ్ – త్రిపుర కౌంటింగ్: బీజేపీ అదృష్టం ఎలా ఉందొ..

Saturday, March 3rd, 2018, 11:25:24 AM IST

చాలా కాలం తరువాత దేశాన్ని ఎలుతోన్న కమలం పార్టీ వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం చేజారకుండా చూసుకుంటోంది. గెలుపు బాటను ఇంకా పొడగించాలని దేశం నలువైపులా భారత జనతా పార్టీ జెండా ఉండాలన్నదే ఆ పార్టీ నాయకులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక మొన్నిటి వరకు జరిగిన ఎన్నికలు ఒకలెక్క రీసెంట్ గా జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు మరొక లెక్క. త్రిపుర – మేఘాలయా నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలేది ఈ రోజే.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందు జాగ్రత్తగా ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ వైపు మూడు రాష్ట్రాలను తన అధీనంలో ఉంచుకున్న భాజపా ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ కూడా కీలకంగా మారాయి. కౌంటింగ్ మాత్రం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా జరుగుతోంది. మేఘాలయలో బీజేపీ గెలవడం కష్టమే కానీ త్రిపురలో మాత్రం పోటీ గట్టిగా ఇస్తోంది. వామపక్షాలను ఎదుర్కోవాలంటే ఆ పార్టీకి చాలా కష్టమే. పాతికేళ్లుగా బీజేపీ త్రిపురలో గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. నాగాలాండ్ లో మాత్రం బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.