“ఎన్టీఆర్” ఎఫెక్ట్: అక్కినేని బయోపిక్ విషయంలో నాగ్ మనసు మారిందా..?

Friday, January 11th, 2019, 05:05:03 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ కాకముందే ఏఎన్నార్ బయోపిక్ రాబోతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అక్కినేని బయోపిక్ ఎప్పుడుంటుంది అంటూ నాగార్జున ప్రశ్నించటం ప్రారంభించింది మీడియా . అయితే నాగార్జున మాత్రం ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, కాబట్టి ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయంటూ తన అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు.బయోపిక్ అంటే మహానటి సినిమాలో లాగా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అప్పట్లో నాగ్ అభిప్రాయ పడ్డారు .

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. సినిమా తీశాక లాభనష్టాల సంగతి అటుంచితే, తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి అక్కినేని బయోపిక్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.