కింగ్ పైనే ఆరోణలు..ఇలా సమాధానం ఇచ్చాడు..!

Thursday, November 17th, 2016, 04:30:52 PM IST

Nagarjuna (1)555
అక్కినేని నాగార్జున పై ఇటీవల బ్యాంకు రుణాలకు సంభందించి అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తానూ బ్యాంకులకు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా నాగార్జున వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.తాము ప్రస్తుతం బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేమని స్పష్టం చేసాడు. అన్న పూర్ణ స్థూడియోస్ అవసరాల కోసం గతం లో బ్యాంకులనుంచి లోన్ తీసుకున్న మాట వాస్తవమే అని నాగార్జున అన్నారు. అయితే వాటిని ఈ ఏడాది ప్రారంభంలోనే వాటిని చెల్లించినట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే తమపై ఇప్పుడు వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని నాగార్జున అన్నారు. తముకాని అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతోకాని ఎలాంటి బ్యాంకు బకాయిలు లేవని నాగ్ వివరణ ఇచ్చారు. నాగార్జునే స్వయంగా దీనిపై సోషల్ మీడియాలో స్పందించడం విశేషం.