రేపు జరగబోయే ఫైనల్స్ లో భారత్ v/s బాంగ్లాదేశ్ ఎవరి బలమెంత ?

Thursday, September 27th, 2018, 07:16:19 PM IST

ప్రస్తతం దుబాయ్ లోజరుగుతున్న ఆసియా కప్ చాల ఆసక్తి కరం గా సాగుతుంది . ఐతే ఇందులో భాగం గా నే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో బాంగ్లాదేశ్ చేతి లో పాకిస్థాన్ అనూహ్య ఓటమిని చవి చూసింది. దీంతో బాంగ్లాదేశ్ జట్టు ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. ఐతే ఫైనల్స్ లో శుక్రవారం భారత్ తో తలపడనుంది. ఐతే ఒకసారి బౌలింగ్ మరియు బాటింగ్ పరంగా రెండు జట్ల సామర్థ్యాల్ని పరిశీలిస్తే ….భారత్ కి టాప్ ఆర్డర్ పటిష్టం గానే ఉందని చెప్పవచ్చు మరియు ఇప్పటికే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (కెప్టెన్),శిఖర్ ధావన్ లు మంచి ఫామ్ లో ఉండడం భారత్ కి కలిసొచ్చే అంశం. అంతే గాక మిడిల్ ఆర్డర్ లో అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, ధోని లు కూడా జట్టు కి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ఐతే పేసర్ భువి మరియు బుమ్రాలు తమదైన శైలి లో వికెట్లను పడగొడ్తున్నారు … మరోపక్క స్పిన్నర్ల విభాగంలో జడేజా, చహాల్, కుల్దీప్ యాదవ్ ల బలం ఎలాగో ఉండనే ఉంది కాబట్టి భారత్ అన్ని విధాలా కొంచెం పటిష్టం గానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు …

ఐతే ఇది ఇలా ఉండగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టినటువంటి బాంగ్లాదేశ్ జట్టు కూడా బాగానే పటిష్టం గా ఉన్నట్లు కన్పిస్తుంది …. నిన్న జరిగినటువంటి పాకిస్థాన్ మ్యాచ్ లో మనం గమనించినట్లు ఐతే బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ పటిష్టం గానే ఉన్నట్లు తెలుస్తుంది అంతే గాక టాప్ ఆర్డర్ కొంచెం తడబడినా కానీ మిడిల్ ఆర్డర్ లో ముష్ఫిఖర్ రహిమ్, అద్భుత ఫామ్ లో ఉండడం బంగ్లా జట్టు కి కలిసొచ్చే అంశం. మరియు బౌలింగ్ విభాగం లో షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజూర్ రెహమాన్ ల తో బలం గా ఉందని చెప్పవచ్చు. అంతేగాక ఈ టోర్నమెంట్ లో భారత్ కి దీటు గా నిలిచినా జట్టు ఏదైనా ఉంది అంటే బంగ్లా జట్టే అని విశ్లేషకుల అభిప్రాయం. ఐతే రేపు జరగబోయే మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.