రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చిన నాయని నరసింహ రెడ్డి..!

Sunday, October 14th, 2018, 02:00:51 AM IST

ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన పార్టీకి చెందిన నాయని నరసింహా రెడ్డి గారిని లెక్క చెయ్యట్లేదు అని,కనీసం ఆయనకీ కలవడానికి అనుమతి కూడా ఇవ్వట్లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.అయితే ఈ మాటల బట్టి రేవంత్ రెడ్డి నరసింహ రెడ్డి గారికి అనుకూలంగానే మాట్లాడారు అనుకున్న సందర్భంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి మీదనే కాకుండా చంద్రబాబు మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ టీడీపీ శ్రేణులకు తన ప్రగతి భవన్ లో తాను ఎంత డబ్బు ఐనా ఖర్చు పెడతాను మీరు కాంగ్రెస్ తో కలిసి తెరాస పార్టీ ని గద్దె దించాలని అడుగడుగునా ఎందుకు అడ్డుపడుతున్నావ్ అని మండిపడ్డారు.అదే సందర్భంలో రేవంత్ రెడ్డి పై మాట్లాడుతూ..నీ ఇంటి మీద ఐటీ దాడులు జరిగితే అది మోడీ కెసిఆర్ చేయించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.ఎవరో ఒక అడ్వొకేట్ గత సంవత్సరం నుంచి ఫిర్యాదు చేస్తే దాని ఫలితమే ఇది కానీ ఇందులో కెసిఆర్ హస్తం ఏమి లేదని తెలిపారు.నరసింహ రెడ్డి పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ కోసం రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడిన సంగతి తెలిసినదే.

ఇప్పుడు ఆ మాటలపై వివరణ ఇస్తూ నేను ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలని ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలనే తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని,ఆ సందర్భంలో కెసిఆర్ తనకి సహాయంగా 10 లక్షలు సర్దుతానంటే రేవంత్ రెడ్డి దాన్ని 10 కోట్లు చేసేశాడని ఆరోపించారు.రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.ఇలాంటివన్నీ చేసి రేవంత్ రెడ్డి కొడంగల్ లో అడ్రస్ లేకుండా పోతున్నావని సంచలన వ్యాఖ్యలు చేశారు.