షాక్‌ : టాప్ పొలిటీషియ‌న్‌ని లేపేసే కుట్ర‌?

Thursday, November 2nd, 2017, 01:25:17 AM IST

ఏపీలో అధికార పార్టీలో ఉన్న ఓ టాప్ పొలిటీషియ‌న్‌ని లేపేసేందుకు భారీ కుట్ర జ‌రిగిందా? .. అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. స‌ద‌రు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ను ఎప్ప‌టినుంచో శ‌త్రువులు టార్గెట్ చేశారు. కాపు కాసి స‌మ‌యం చూసి లేపేసేందుకు ఇదివ‌ర‌కే కుట్ర‌లు జ‌రిగాయి. కానీ ఎలాగోలా వాటి నుంచి అత‌డు ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం త‌న‌ని ఎట్టి ప‌రిస్థితిలో హ‌త‌మార్చాల‌ని సీరియ‌స్‌గానే కుట్ర చేశార‌ని చెబుతున్నారు. అస‌లింత‌కీ ఎవ‌రా టాప్ పొలిటీషియ‌న్ ? అంటే .. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు అనే పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఏపీ టీడీపీలో చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. చంద్ర‌బాబుకు కుడిభుజం లాంటి నాయ‌కుడు. విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి చేరువ‌లో ఉన్న న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఎదురే లేని నాయ‌కుడిగా ద‌శాబ్ధాల పాటు హ‌వా సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కేబినెట్‌లో రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రిగా హ‌వా సాగిస్తున్నారు. ఇక న‌ర్సీప‌ట్నం స‌హా విశాఖ జిల్లాలో అయ్య‌న్న పాత్రుడు ఆయ‌న సోద‌రుల హ‌వా సాగుతోంది. అయ్య‌న్న .. మ‌రో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అయ్య‌న్న పాత్రుడును టార్గెట్ చేసింది ఎవ‌రు? అంటే న‌క్స‌లైట్లు అత‌డిని సీరియ‌స్‌గా టార్గెట్ చేశార‌ని చెబుతున్నారు. మొన్న‌టికి మొన్న అయ్య‌న్న పాత్రుని సోద‌రుడైన సి.హెచ్‌ స‌న్యాసి పాత్రుడు కార్‌లో ఓ రికార్డర్ దొరికింది. ఆ రికార్డ‌ర్‌లో నాయ‌కులు మాట్లాడుకున్న విష‌యాల‌న్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అయితే ఆ రికార్డ‌ర్ పెట్టింది ఎవ‌రు? అన్నది ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. న‌క్స‌లైట్లు త‌మను టార్గెట్ చేసి ఇలా రికార్డ‌ర్ సాయంతో ఎవ‌రేం చేస్తున్నారో .. ఎక్క‌డికి వెళుతున్నారో తెలుసుకోవాల‌నుకున్నారా? అనే కోణంలో ద‌ర్యాప్తు సాగిస్తున్నారుట‌. ప్ర‌స్తుతం ఈ వార్త న‌ర్సీప‌ట్నం స‌హా ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో వేడి ర‌గిల్చింది. అయ్య‌న్న పాత్రుడు అండ్ ఫ్యామిలీకి ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక అయ్య‌న్న‌పాత్రుడి మ‌రో సోద‌రుడైన శ్రీ‌నివాస్ పాత్రుడిని 2001లో న‌క్స‌లైట్లు హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే అయ్య‌న్న పాత్రుని త‌న‌యుడు చింత‌కాయ‌ల విజ‌య్‌కి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. న‌ర్సీప‌ట్నం ఏజెన్సీ ప్రాంత‌మైన స‌రుగుడు (జికె మాడుగుల ఏరియా)లో అన‌ధికారిక క్వారీయింగ్‌కి పాల్ప‌డుతున్నాడ‌ని, వెంట‌నే ఆ ప‌నిని విర‌మించుకోక‌పోతే చావు త‌ప్ప‌ద‌ని ఎర్ర జెండాలు హెచ్చ‌రిక‌లు పంపాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి గారి ఫ్యామిలీకి పోలీస్ బందోబ‌స్తు రెట్టింపు చేశార‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments