నడి రోడ్డుపై కన్న తండ్రినే కడ తేర్చారు!

Wednesday, April 4th, 2018, 11:07:30 PM IST

మానవత్వం మంటగలిసిపోతోంది అనడానికి రోజుకో ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. బంధుత్వాలను మరచి సొంత వారే ప్రాణాలను తీయడం సంచలనంగా మారింది. కొందరైతే మరి దారుణంగా కని పెంచిన తల్లిదండ్రులనే చంపేస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ తండ్రిని ఇద్దరు కుమారులు కలిసి దాడి చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసారిగా పరిసర ప్రాంత వాసులు ఆ ఘటన గురించి తెలుసుకొని షాక్ అయ్యారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారెడ్డి గోవిందరెడ్డి మండల బ్యాంకుకు వెళ్లాడు. తోడుగా అల్లుడు కూనిరెడ్డి సైదురెడ్డి కూడా వెళ్లాడు. బుధవారం బ్యాంకు పని ముగించుకుని వెళుతుండగా గోవింద రెడ్డి కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలు ఎదురయ్యారు. మాట్లాడుకుంటున్నారు అనుకునే లోపే స్థానికులు అక్కడ రక్తపాతాన్ని చూశారు. కుమారులు నడిరోడ్డుపై కన్న తండ్రిని బావ సైదురెడ్డిలపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కర్రలతో రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. అయితే అప్పటికే గోవిందా రెడ్డి మృతి చెందగా అతని అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆస్తి తగాదాలే అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments