రాహుల్ గాంధీకి రుణపడి ఉంటా : నళిని శ్రీహరన్‌

Saturday, September 8th, 2018, 12:19:10 PM IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో గత కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ రాహుల్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రిని హత్య చేసిన వారిపై నాకు కోపం లేదని గతంలో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా వారిపై ఎలాంటి కోపం లేదనీ.. వారిని క్షమిస్తున్నా అని రాహుల్‌ గాంధీ తెలుపడం అందరిని ఆకర్షించింది. అయితే రాహుల్ స్పందించిన విధానానికి నళిని శ్రీహరన్‌ భావోద్వేగానికి లోనవుతూ జీవితకాలం ఋణపడి ఉంటామని అన్నారు.

ప్రముఖ ఆంగ్ల మీడియా జరిపిన ఉత్తరాల ఇంటర్వ్యూ ద్వారా నళిని ఈ విధమైన సమాధానం తెలియజేశారు. ఆయన తండ్రిని హత్య చేసిన మమ్మల్ని క్షమించి హృదయం చాలా విశాలమైందని నిరూపించుకున్నారు. జీవితం మొత్తం ఆయనకు ఋణపడి ఉంటాం. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను. ఇకనైనా నా కూతురితో తండ్రితో సంతోషంగా గడపాలని అనుకుంటున్నా అని నళిని వివరణ ఇచ్చారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం తనపై దయ చూపిస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇక రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏ జీ పెరరివాలన్‌ కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత క్షమాబిక్ష పిటిషన్ లో అండగా నిలబడ్డారు. అతను చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అయితే కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించగా నిందితులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయవద్దంటూ కోర్టు ఉత్తర్వ్యూలు జారీ చేసింది. అదే విధంగా నిందితులను కేంద్రం అంగీకారం తీసుకోకుండా విడుదల చెయ్యకూడదని అప్పటి ధర్మసనం వివరణ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments