చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం.. టీడీపీ కంచుకోటలో బ‌రిలోకి దిగ‌నున్న‌.. నందమూరి హరికృష్ణ కుమార్తె ..?

Wednesday, November 14th, 2018, 09:40:29 AM IST

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో అధికార-ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టీఆర్ఎస్ 105 మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కిటించ‌గా మిగ‌తా వారిని రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే మ‌రోవైపు అనూహ్యంగా దూసుకు వ‌చ్చిన మ‌హాకూట‌మి తొలివిడ‌త జాబితాను మంగ‌ళ‌వారం ప‌క‌టించినా.. మిగ‌తా సీట్ల విష‌యంలో ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉంది. ఇక మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు ఇవ్వ‌గా.. ఇప్ప‌టికే 9 మందిని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే రాజ‌కీయ వ‌ర్గాల నుండి వ‌స్తున్న తాజా హాట్ మ్యాట‌ర్ ఏంటంటే గ్రేట‌ర్ ప‌రిదిలో ఉన్నకూకట్‌పల్లి నియోజ‌కవ‌ర్గం నుండి నంద‌మూరి ఫ్యామిలీ నుండి ఒక‌రిని టీడీపీ బ‌రిలోకి దింప‌నుంద‌ని స‌మాచారం. హైద‌రాబ‌ద్‌లో తొలి నుండి టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది. ఈ క్ర‌మంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లి టీడీపీ అభ్యర్థిగా దించ‌నున్నార‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా ఈస్థానం నుండి క‌ళ్యాణ్‌రామ్‌ను బరిలోకి దింపాల‌ని భావించింది టీడీపీ. అయితే ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న‌ క‌ళ్యాణ్‌రామ్ ఆశ‌క్తి చూప‌క‌పోవ‌డంతో.. ఇప్పుడు సుహాసినిని బ‌రిలోకి దింప‌నున్నార‌ని టాక్. ఈ విష‌యాన్ని తాజాగా ఏర్పాటు చేసిన టీటీడీపీ స‌మావేశంలో చంద్ర‌బాబు తేల్చిచెప్పార‌ని స‌మాచారం. మ‌రి ఈ విష‌యం పై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాలంటే వెయిట్ చేయాల్సిందే.