నందమూరి ఆడబిడ్డ ఓటర్లను ప్రలోభానికి గురిచేయబోయారా ?

Friday, December 7th, 2018, 12:00:28 PM IST

తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు మొన్న 5వ తేదీ సాయంత్రానికే ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం తర్వాత అభ్యర్థులు, పార్టీలు, కార్యకర్తలు అందరూ సైలెంట్ అయిపోవాలని, ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం గట్టిగానే చెప్పింది. కానీ అడపాదడపా కొన్ని పార్టీల వారు సైలెంట్ గా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించాలని యత్నించారు.

వారిలో నందమూరి ఆడబిడ్డ, ప్రజకూటమి నుండి టీడీపీ తరపున కూకట్ పల్లి బరిలో నిలబడిన సుహాసిని కూడ ఉండటం గమనార్హం. గురువారం రాత్రి ఆమె ల్లాపూర్ డివిజన్లలోని గణేష్ నగర్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సంగతి తెలుసుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకుని కూకట్ పల్లి నోడల్ అధికారికి సుహాసిని ఓటర్లను ప్రలోభపెట్టే పయత్నాలు చేస్తున్నారని పిర్యాదు చేశారు. దాంతో అధికారులు సమావేశం ఆపివేసి ఆమెను అక్కడి నుండి పంపివేశారు.

మంచి విద్యావంతురాలు, భాద్యత కలిగిన ఎమ్మెల్యే పదివికి పోటీ చేస్తున్న సుహాసిని ఇలా ఎన్నికల సంఘం విధించిన కోడ్ ను అతిక్రమించడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది.