నంది అవార్డు డైరెక్టర్ కు ఒక్క టికెట్ కూడా తెగడం లేదు.!

Friday, May 17th, 2019, 12:31:42 PM IST

మన టాలీవుడ్ లో ఏ టెక్నిషియన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేం.ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఒకే సినిమాకు నాలుగు నంది అవార్డులను గెలుచుకున్న దర్శకుడు ఉన్నారు.దర్శకుడు సునీల్ రెడ్డి 2001 నుంచి ఇప్పటి వరకు దర్శకునిగా రచయితగా కొనసాగుతూ ఉన్నారు.ఆ మధ్య 2009 లో సొంతూరు అనే సినిమాకు ఏకంగా నాలుగు నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు.ఆ తర్వాత తీసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సరికొత్త జానర్ ను ఆయన ఎంచుకున్నారు.

2012 లో ఒక “రొమాంటిక్ క్రైమ్ కథ” అంటూ అప్పట్లో చిరు సంచలనాన్ని రేపగా అది మంచి హిట్టయ్యింది.ఆ తర్వాత కూడా మళ్ళీ అదే జానర్లో “ఒక క్రిమినల్ ప్రేమ కథ” అని మరో సినిమా తీస్తే అది కూడా బాగానే ఆదరించారు.ఇక ఈసారి మాత్రం ఈ రెండు కలిపేసి “రొమాంటిక్ క్రిమినల్స్” అని పేరు పెట్టి ఈ రోజే విడుదల చేయగా ప్రేక్షకులు తిప్పికొట్టారు.ఈ రోజు విడుదలకు ఈ సినిమా నోచుకున్నా థియేటర్లకు మాత్రం జనం ఎవరూ రాక చాలా చోట్ల షోలు కూడా ఆపేసినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ లోని ఆసియన్ లక్ష్మి కళ థియేటర్ లో అయితే ఒక్క టికెట్ కూడా తెగలేదట.