బిగ్ బాస్: నాని సినిమాకు ఇబ్బందులు తప్పవా?

Tuesday, September 18th, 2018, 08:12:00 PM IST

బిగ్ బాస్ అంటే తెలుగు ఆడియెన్స్ కి ఇప్పుడు ఫెవరెట్ షోగా మారిపోయింది. ముఖ్యంగా కౌశల్ కి అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత సీజన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి బాగానే ఎంటర్టైన్ చేశాడు. అయితే ఎక్కువగా కాంట్రవర్సీలు తనవరకు తిప్పుకోలేదు. కానీ ఈ సారి నాని ఊహించని విధంగా వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. హౌస్ లో అందరూ కౌశల్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని పరిస్థితుల్లో కౌశల్ తీరు వల్ల నాని కూడా కౌశల్ ని టార్గెట్ చేయడం తప్పడం లేదు.

కౌశల్ పై నాని చేస్తున్న పంచ్ లు చాలా వరకు వైరల్ అవుతున్నాయి. దీంతో కౌశల్ ఆర్మీ నానిని కూడా వదలడం లేదు. సోషల్ మీడియాలో గట్టిగా వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు కౌశల్ ఆర్మీ డైరెక్ట్ గా నాని దేవదాస్ సినిమాపై కూడా పడ్డారు. నాని సినిమాపై నెగిటివ్ ప్రచారం బాగా మొదలైంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కౌశల్ ఆర్మీ రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేసినా చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా బావుంటే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.