అమోలి షార్ట్ ఫిలిం కి నాని డబ్బింగ్ సాయం..ఎందుకో తెలుసా..?

Monday, May 7th, 2018, 05:39:24 PM IST

దేశంలో ఎక్కడా చూసినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కూరగాయలు అమ్ముతున్నంత సులువుగా ఆడపిల్లలను అమ్మేస్తున్నారు. వేశ్యాలుగా మార్చి వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. ఆరు నెలల పాప నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకు ఆడజాతివి ఒకే కష్టాలు. ఆ కష్టాలను కళ్లకు కట్టేందుకు వచ్చిందే అమోలి షార్ట్ ఫిల్మ్.

దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక ఆడపిల్ల కిడ్నాప్ అవుతున్న కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన నివేదికే చెబుతోంది. అపహరణకు గురైన ఆడపిల్లల్లో ఇంటికి క్షేమంగా చేరేవారు చాలా తక్కువ. మిగిలిన వారంతా ఏమవుతున్నారు? వారి జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయ్? అనే విషయాలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు తీసిందే అమోలి. కేవలం 28 నిమిషాల నిడివి కల ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో హాట్ స్టార్ ఫేస్ బుక్లో ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు . తెలుగులో ఆ సినిమాకు హీరో నాని వాయిస్ ఇచ్చారు. సామాజిక సమస్యలంటే చాలు ముందుంటే నాని అమోలికి సినిమాను ప్రమోట్ చేసేందుకు కూడా ముందున్నాడు.

హిందీలో అమోలికి రాజ్ కుమార్ రావ్ ఆంగ్లంలో విద్యా బాలన్ తమిళంలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ అందించారు. దేశంలోని ఓ చీకటి కోణాన్ని కన్నీళ్లు తెప్పించే విధంగా చిత్రీకరించారు. మా పిన్ని నన్ను అమ్మేసింది అంటూ ఓ అమ్మాయి చెప్పిన తన జీవిత కథ కచ్చితంగా అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తుంది. అమోలి అంటే వెలకట్టలేనిది అని అర్థం. నిజమే ఆడపిల్ల వెలకట్టలేనిదే మరి.

  •  
  •  
  •  
  •  

Comments