శ్రీరెడ్డికి హీరో నాని గట్టి రిటార్ట్ !

Monday, June 11th, 2018, 06:34:25 PM IST

ఇటీవల కాస్టింగ్ కౌచ్ విషయమై టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలకోసం వచ్చే అమ్మాయిలను, మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను కొందరు సినిమా కో ఆర్డినేటర్లు, మధ్యవర్తులు సినిమా అవకాశాల పేరుతో లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆమె ఉద్యమానికి కొందరు మద్దతు పలికారు. కాగా శ్రీరెడ్డి అప్పట్లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరాం క్లోజ్ గా వున్న ఫోటోలు మీడియాకి లీక్ చేసిన విషయం తెలిసిందే. ఇక పోతే ప్రస్తుతం ఆమె కొద్దిరోజులనుండి నాచురల్ స్టార్ నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. నాని తనను గతంలో లైంగిక వేధింపులకు గురిచేసాడని ఆరోపించింది. అంతే కాదు తనకు బిగ్ బాస్-2 లో ఛాన్స్ రాకుండా కూడా అడ్డుకుంది నానియే అని, ఇండస్ట్రీలో ప్రస్తుతం కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం రెండు సామజిక వర్గాలలో ఒక ముఖ్య సామజిక వర్గానికి చెంది ఉండడంవల్ల నానికి అవకాశాలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు.

ఇకపోతే ఆమె వ్యాఖ్యలపై నేడు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా స్పందించిన నాని, అటువంటి వారి వ్యాఖ్యలపై స్పందించవలసిన అవసరం లేదని, అలాంటివారు చేసేదంతా నాన్సెన్స్ అని అన్నారు. అంతే కాదు ఆమెకు త్వరలో లీగల్ నోటీసు ఇచ్చి, ఆమె పై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు నాని తెలిపారు. నిజానికి ఆమె ఆరోపణలు తనను బాధించాయని, సాఫ్ట్ గా సైలెంట్ గా వున్నాను కనుకే తనపై టార్గెట్ చేస్తున్నారు అన్నారు. అయితే నిజానికి తన గురించి తనకు ఏమీ బెంగ లేదని, అయితే సొసైటీ గురించి ఆలోంచించే తాను ఈ విధంగా రియాక్ట్ అయినట్లు నాని ట్విటర్ లో ఒక పోస్ట్ పెట్టారు. మరి నాని పెట్టిన ఈ పోస్ట్ కు శ్రీరెడ్డి ఎలా సమాధానమిస్తుడో వేచి చూడాలి…….

  •  
  •  
  •  
  •  

Comments