మొదటిసారి కొత్త యాంగిల్ లో న్యాచురల్ స్టార్..!

Thursday, December 6th, 2018, 11:10:27 AM IST

కెరీర్ ఆరంభం నుండి లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ స్టోరీస్ మాత్రమే తీస్తూ న్యాచురల్ స్టార్ గా, బాయ్ టు ద నెక్స్ట్ డోర్ ఇమేజ్ సొంతం చేసుకొని, తనకంటూ ఒక ప్రత్యేక స్తానం ఏర్పర్చుకున్న నాని, మొదటిసారి థ్రిల్లర్ తో అలరించబోతున్నాడట. ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, ఆ తర్వాత ఇష్క్, మనం, 24 వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కథ థ్రిల్లర్ ఎలెమెంట్స్ తో కూడుకొని ఉండబోతుందట. అన్నొహ్యమైన మలుపులతో సాగే ఈ సినిమా కథలో ఆడవారికి సంబంధించి మంచి సందేశం ఉంటుందట. హీరోయిన్లు ఎవరనేది ఇంకా తేలని ఈ సినిమా ఫిబ్రవరి 19న షూటింగ్ మొదలవనుందట.

ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న జెర్సీ సినిమా విషయానికి వస్తే ఇందులో నాని క్రికెటర్ గా కనిపించబితున్నాడట. అందుకోసం నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో నటించటం నానికి ఇదే తొలిసారి. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2019 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.