సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యభిచారానికి దారి తీస్తుందట.!

Tuesday, October 9th, 2018, 04:03:58 PM IST

గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు భార్యాభర్తల వివాహ సంబంధాలకు సంబంధించి కొన్ని సంచలన తీర్పులని ఇచ్చింది.ఇప్పుడు ఆ తీర్పుల మీద ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటుంది.టీడీపీ పార్టీకి సంబందించిన మహిళా కమీషన్ సమన్వయకర్త నన్నపనేని రాజకుమారి తీవ్రంగా మండిపడుతున్నారు.సుప్రీంకోర్టు యొక్క తీర్పులన్నా అందులోని న్యాయమూర్తులన్నా వారికి గౌరవం ఉందని,అలా అని చెప్పి వారు వారికి ఇష్టమొచ్చినట్టుగా తీర్పులు ఇచ్చుకుంటూ పోతే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవరు లేరని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారు రిటైర్ అయ్యే సమయంలో ఇష్టమొచ్చిన తీర్పులిచ్చి వెళ్ళిపోతే దేశంలో ప్రజలు అన్యాయం అయ్యిపోతున్నారని తెలియజేసారు.ఇటీవలే వివాహేతర సంబంధం తప్పు కాదని సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన సంగతి తెలిసినదే.ఈ తీర్పు పట్ల మహిళలు తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారని,ఇటీవలే వారికి తెలిసిన ఒక మహిళ యొక్క భర్త ఆమెను వదిలి వేరే వారితో సంబంధం ఏర్పరుచుకుంటున్నారని దాని కోసం ప్రశ్నించగా ఇప్పుడు ఇలాంటివి అన్ని న్యాయబద్ధం అయ్యాయని అన్నారు అని తెలిపారు.ఈ చట్టం ప్రవేశ పెట్టడం వల్ల ఇప్పుడు ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయని,ఇలాంటి చట్టాలు వస్తే ఈ సమాజం ఎటు పోతుందని,సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు వ్యభిచారానికి దారి తీస్తుందని మండిపడ్డారు.