ఏపీలో హాట్ టాపిక్.. నారా బ్రాహ్మణి సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Thursday, October 25th, 2018, 12:01:40 AM IST

తిత్లీ తుపాను ఉత్త‌రాంధ్రా మొత్తం అత‌లాకుత‌లం అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పంట‌న‌ష్టం భారీగా ఆస్థి న‌ష్టం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ వ‌ర‌ద బాదితుల‌కు చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖ‌లు, వ్యాపార వేత్త‌లు, త‌మ‌కు తోచిన విధంగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ 25 లక్షలు, బాలకృష్ణ 25 లక్షలు, జూనియ‌ర్ ఎన్టీఆర్ 15 లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ 5 లక్షలు, విజయ దేవరకొండ 5 లక్షలు, వరుణ్ తేజ్ 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50వేలు త‌మ‌వంతుగా విరాళాలు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌ను శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవాల‌ని కోర‌తాన‌ని అన్నాడో లేదో.. రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే స్పందించి ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవ‌డానికి ముందుకు వ‌చ్చారు. త్వ‌ర‌లోనే త‌ను ద‌త్త‌తు తీసుకోనున్న గ్రామాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అయితే తాజాగా.. నారా బ్రాహ్మ‌ణి శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా తొమ్మిది గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌నే వార్త ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. దీంతో ప‌లువురు ప్ర‌ముఖులు రాజ‌కీయాల‌కు అతీతంగా నారా బ్రాహ్మ‌ణిని అభినందిస్తున్నారు. తిత్లీ తుఫాను బాదితుల‌ను ఆదుకునేందుకు త‌న‌వంతుగా ముందుకు వ‌చ్చి 9గ్రామాల‌ను ద‌త్త‌తు తీసుకుని ఆమె ఎంతోమందికి స్పూర్తిదాయ‌కంగా నిలిచార‌ని నారా బ్రాహ్మ‌ణికి సెల్యూట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments