వైఎస్ జ‌గ‌న్ పై.. మంత్రి లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వైసీపీ శ్రేణులు – మీ రియాక్ష‌న్ ఏంటి..?

Sunday, October 21st, 2018, 02:48:10 AM IST

ఏపీలో అధికార – ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒక‌రి పై మ‌రొక‌రు చేసుకుంటున్న విమ‌ర్శ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తిత్లీ తుఫాను ఉత్తారాంధ్ర‌ని అత‌లా కుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తుఫాను బాదిత ప్రాంత‌మైన శ్రీకాకుంళం జిల్లాకి వెళ్ళ‌క‌పోవ‌డంతో ఆయ‌న పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు టీడీపీ శ్రేణ‌లు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విమ‌ర్శిస్తూ.. అయ్యా ముద్దుల వీరుడా.. ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు వెళ్ళ‌డానికి నీకు టైమ్ ఉంది గానీ.. తుఫాను బాదితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తీరిక లేదా అన్ని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. విజ‌య‌న‌గ‌రంలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్.. పొరుగు జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం చాలా దారుణ‌మ‌ని లోకేష్ అన్నారు. అంతే కాకుండా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ప‌ల‌వురు టీడీపీ నేత‌ల పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ల‌క్ష‌కోట్లు దోచుకొని జైలుకు వెళ్ళిన వ్య‌క్తి.. టీడీపీ నేత‌ల్ని విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని లోకేష్ మండిప‌డ్డారు. టీడీపీ చాలా క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని.. అలాగే మార్టీలో ప‌ని చేసే నేత‌లు కూడా చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేస్తార‌ని.. అలాంటి వారి పై జ‌గ‌న్‌కు విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని.. లోకేష్ వ్యాఖ్యానించారు. మ‌రి లోకేష్ వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments