మరోసారి తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్న నారా లోకేష్ !

Friday, October 26th, 2018, 04:32:50 PM IST

చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ అమాయకత్వం ఇప్పటికే పలుసార్లు బహిరంగంగా రుజువుకాగా ఇప్పుడు మరోసారి బయటపడింది. ఈ ఉదంతమే ఆయన రాజకీయాల్లో ఇంకా ఓనమాలు నేర్చుకునే స్టేజీలోనే ఉన్నారని స్పష్టం చేస్తోంది. నిన్న మధ్యాహ్నం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే పలువురు పార్టీ పెద్దలు ఆ దాడిని ఖండించారు. వాళ్ళను చూశాడో లేకపోతే తండ్రి మాట విన్నాడో లేకుంటే తనకు తానే స్పందించాడో తెలీదు కానీ నారా లోకేష్ కూడ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ నవ సమాజంలో ఇలాంటి పిరికిపంద చర్యలను తావులేదని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానిని చూసి తేదేపా శ్రేణులు సైతం భేష్ అనుకున్నాయి.

కానీ 24 గంటలు గడవకముందే లోకేష్ బాబు చాతుర్యం బయటపడిపోయింది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది వైఎస్ జగన్ కావాలని ఆడుతున్న హైడ్రామా అని విరుచుకుపడగా ఆయనను ఫాలో అవుతూ లోకేష్ కూడ జగన్ జగన్నాటకం ఆడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. అంతేనా తండ్రి చితికి నిప్పు పెట్టకముందే సిఎం పీఠం పై కన్నేసిన వ్యక్తి జగన్ అంటూ హేళనగా మాట్లాడారు. తాను పాల్గొంటున్న ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసమే ఈ కోడి కత్తి డ్రామా అన్నారు. మోడీ, జగన్ ఒకటైపోయారని తీర్మానం చేశారు.

ఈ ట్వీట్లు వేస్తున్నప్పుడు ఆయనకు కింద జగన్ పై దాడిని ఖండిస్తూ తాను చేసిన ట్వీట్ కనిపించలేదో, అసలు దాని ఎఫెక్ట్ ఈ కొత్త స్టేట్మెంట్స్ మీద కనబడి తన అమాయకత్వం బయటపడుతుందని తట్టలేదో కానీ మొత్తానికి టపీ టపీమని ట్వీట్లు వదిలేశారు. దీంతో జనానికి ఈ దాడిపై లోకేష్ స్టాండ్ ఏమిటో అర్థంకాక ఎప్పటిలాగే లైట్ బాసూ అనుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments