బ్రేకింగ్ న్యూస్ : పవన్ కు స్పందించిన లోకేష్… అసలేమన్నాడు

Saturday, April 21st, 2018, 11:15:31 PM IST

గత కొద్ది రోజులుగా సినీ నటుడు, జనసేన అభినేత పవన్ కళ్యాన్ పై ఎదో ఒక రూపంలో జరుగుతున్నా అనుచిత వ్యాఖ్యలు, అవాంచిత మాటల దాడుల గురించి తెలిసిందే. అయితే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ్యక్తిగత ప్రోత్సాహంతో ప‌వ‌న్ త‌ల్లిపై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కిగాను ప‌వ‌న్ నిన్న ఫిలిం ఛాంబ‌ర్‌కి వెళ్ళి తీవ్ర స్థాయిలో నిన్న ఉదయం నిర‌స‌న తెలిపాడు. మీడియా వ్య‌వ‌హార‌శైలిని కూడా దుయ్య‌బ‌డుతూ త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు ట్వీట్స్ చేస్తూ వ‌స్తున్నాడు ప‌వ‌న్‌. ఆయన కామెంట్లకు సినీ అభిమానులే కాకుండా రాజకీయ అభిమానులు కూడా కామెంట్ల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో మ‌రి కొంద‌రి పేర్లు కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని కొన్ని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. అయితే అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా విరిచేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?’ అని ట్విట్ట‌ర్ ద్వారా సూటిగా ప్ర‌శ్నించారు ప‌వ‌న్‌. గుంటూరు స‌భలోను నారా లోకేశ్‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ త‌న‌పై చేసిన కామెంట్స్‌కి నారా లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ అని అన్నారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments