అదొక జ‌గ‌న్నాట‌కం.. నారా లోకేష్ సంచ‌ల‌న ట్వీట్..!

Friday, October 26th, 2018, 04:12:58 PM IST

వైసీపీఅధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో క‌త్తితో దాడి చేసి హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఆ దాడిలో తృటిలో త‌ప్పించుకోగా ఆయ‌న భుజానికి గాయం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక దాడి అనంత‌రం అక్క‌డే ప్ర‌థ‌మ చికిత్స చేయించుకున్న జ‌గ‌న్ హైద‌రాబాద్ వ‌చ్చి సిటీ న్యూరో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుని ఈ మ‌ధ్యాహ్న‌మే డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే ఒక‌వైపు జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే మ‌రో వైపు మాత్రం టీడీపీ శ్రేణులు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ పై దాడి పెద్ద డ్రామా అని తేల్చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి లోకేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అధికారం కోసం జ‌గ‌న్ అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని.. ఈ క్ర‌మంలో వైసీపీ కోడి క‌త్తి డ్రామా మిస్‌ఫైర్ అయ్యింద‌ని లోకేష్ అరోపించారు. నాడు తండ్రి పార్థీవ దేహాన్ని ప‌క్క‌న పెట్టుకుని సీయం కుర్చీ కోసం మంత‌నాలు చేశార‌ని .. అలాంటి జ‌గ‌న్ నేడు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు త‌న అభిమానితోనే పొడిపించుకుని నాట‌కాలు ఆడుతున్నార‌ని లోకేష్ ఫైర్ అయ్యారు. ఇక చివ‌రిగా ఇదంతా ఓ జ‌గ‌న్నాట‌క‌మ‌ని లోకేష్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. మ‌రి లోకేష్ ట్వీట్‌కు వైసీపీ శ్రేణుల ఎలా స్పందిస్తారో చూడాలి.