జగన్,మోడీ జోడీపై లోకేష్ షాకింగ్ కామెంట్స్.!

Monday, February 11th, 2019, 03:52:04 PM IST

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ఇతర తెలుగుదేశం పార్టీ నేతలంతా తరలి వెళ్లి రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై తీవ్ర స్థాయిలో వారి నిరసనను వ్యక్తం చేసారు.అయితే ఈ ధర్మ పోరాట దీక్షకు గాను ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా హాజరయ్యారు.అయితే లోకేష్ ఒక పక్క జగన్ మరియు నరేంద్ర మోడీల పై మరో సారి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు.నిన్న నరేంద్ర మోడీ సభకు వైసీపీ తెలిపిన మద్దతుతో జగన్ మరియు మోడీల జోడికి మధ్య ఉన్న సంబంధం మరోసారి బయట పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

అలాగే వారి సభకు వెళ్లే ఆటోలపైనా ఒకపక్క జగన్ పోస్టర్లు అతికించి ఉంటే మరో బీజేపీ పార్టీ జెండాలు కట్టి ఉన్నాయని దీన్ని బట్టే వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అర్ధమయ్యిందని అంటున్నారు.అలాగే మోడీ సభ పెడతానంటే ఇక్కడ వైసీపీ నేతలు ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు కడుతున్నారని,మోడీ తాను అప్పుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అవినీతి పరులందరిని జైల్లో పెట్టిస్తానని అన్నారని,కానీ ఇప్పుడు నాలుగున్నర సంవత్సాలు దాటినా కూడా జగన్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.