బీనామీని ట‌చ్ చేసిన ఐటీ అధికారులు.. ఉలిక్కిప‌డిన టీడీపీ మంత్రి నారా లోకేష్‌..!

Friday, October 12th, 2018, 04:48:47 PM IST

ఏపీలో కొద్ది రోజ‌ల నుండి ఏపీలో జరుగుత‌న్న ఐటీ దాడులు రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇక‌తాజాగా టీడీపీ ముఖ్య నేత రాజ్య‌స‌భ ఎంపీ సీయం ర‌మేష్ పై ఈరోజు ఐటీ సోదాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సీయం ర‌మేష్ పై జ‌రుగుతున్న ఐటీ దాడులు ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగ‌మే అని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విడిపోయాక.. కేంద్ర‌స‌ర్క‌ర్ త‌మ‌ను ఇబ్బంది పెడుతోంద‌ని లోకేష్ మండిప‌డ్డారు.

బీద మ‌స్తాన్, సుజ‌నా చౌద‌రి, సీయం రమేష్ ఇలా టీడీపీ ముఖ్య నేత‌ల పై ఐటీ దాడులు కావాల‌నే రాజ‌కీయ క‌క్ష్య‌తోనే చేయిస్తున్నార‌ని లోకేష్ అన్నారు. ఇక‌పోతే కడపలో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం సీయం రమేష్ చేప‌ట్టిన దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డానికి కేంద్ర‌స‌ర్కార్ నానా విధాలుగా ప్ర‌య‌త్నించినా.. అక్క‌డ దీక్ష వంద‌రోజులు పూర్తి చేసుకుంద‌ని.. క‌డ‌ప ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు అన్నందుకే ఎంపీ సీయం ర‌మేష్‌ను ఐటీ ద్వారా అటాక్ చేశార‌ని.. బీజేపీ స‌ర్కార్ త‌మ‌ని ఎన్ని ర‌కాలుగా ఇబ్బంది పెట్టినా తాము మాత్రం త‌గ్గేదే లేద‌ని లోకే ఫైర్ అయ్యారు.

ఇక మంత్రి నారా లోకేష్ వ్యాఖ్య‌ల పై బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు స్పందించారు. ఐటీ దాడుడ‌ల పై నారా లోకేష్ స్పందించిన తీరు చూస్తే, సీయం ర‌మేష్ .. లోకేష్‌కి బినామీ అని తేలిపోయింద‌ని.. త‌న బినామీని ఐటీ వాళ్లు ట‌చ్ చేసే స‌రికి లోకేష్ ఒక్క‌సారిగా మైండ్ బ్లాక్ అయ్యింద‌ని, లెక్క‌లు క‌రెక్టుగా ఉంటే ఏవ‌రూ ఏం చేయ‌లేర‌ని, ఐటీ అధికారులు అడిగిన వాటికి క‌రెక్టుగా స‌మాధానాలు చెబితే స‌రిపోతుంది.. అంతే కానీ క‌క్ష సాధింపూ అంటూ లోకేష్ వ్యాఖ్యానించ‌డం క‌రెక్ట్ కాద‌ని.. ఎలాంటి ప్రాధ‌మిక ఆధారాలు లేకుండా ఐటీ అధికారులు దాడులు చేయ‌ర‌ని, సీయం ర‌మేష్ అక్ర‌మ లావాదేవీల పై అందిన స‌మాచారం మేర‌కే ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయని.. ఉక్కు దీక్ష‌ను అడ్డుకోవ‌డానికి ఏమాత్రం ఈ ఐటీ దాడులు జర‌గ‌డం లేద‌ని జీవీఎల్ పేర్కొన్నారు.