నో ఛేంజ్.. కష్టాలు కొని తెస్తున్న లోకేష్ !

Sunday, November 18th, 2018, 02:53:14 PM IST

ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ముందు వెనుక చూసుకోకుండా అయాన్ మాట్లాడే మాట్లాడు, వేసే ట్వీట్లు టీడీపీకి కష్టాలు తెస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక మంత్రిగా ఆయన ప్రతి స్టేట్మెంట్ చంద్రబాబు వ్యాఖ్యలకు, చర్యలకు అనుకూలంగా ఉండాలి. కానీ చినబాబు వ్యవహారం అలా లేదు.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిందనే అప్రదిష్టను టీడీపీ మోస్తుండగా నిన్న లోకేష్ చేసిన ట్వీట్లు తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. మకూటమిలో టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్, తెదేపా నేతల్లో చాలా మంది ప్రచార ఫ్లెక్సీల్లో చంద్రబాబు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలతో పాటు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను సైతం పెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నాల్లో ఉండగా లోకేష్ మాత్రం ఏపీలో జగన్ ను విమర్శించాలనే అత్యుత్సహంతో మీ మహానేత వైఎస్ హయాంలోనే అగ్రిగ్గోల్డ్ స్కామ్ జరిగింది, హాయ్ లాండ్ ను ప్రారంభించింది కూడ వైఎస్ సహచరులే కదా అంటూ ట్వీటారు.

దీంతో తలలుపట్టుకోవడం మహాకూటమి నేతల వంతైంది. లోకేష్ పరోక్షంగా తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను కెలికి ఒకప్పుడు వైఎస్ పాలనలో పనిచేసిన తమను ఇరకాటంలోకి నెడుతున్నారని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ తో దోస్తీలో ఉన్నాం కాబట్టి లోకేష్ స్టేట్మెంట్స్ తమకి కూడ ఇబ్బందేనని టీడీపీ నాయకులు లోలోపల వాపోతున్నారు.