కొడుకుని భుజాలపై ఎక్కించుకుని.. పెళ్లి రోజు సంబరాల్లో లోకేష్..!

Monday, September 25th, 2017, 11:20:27 AM IST


చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారాలోకేష్ తన కుటుంబం తో వెకేషన్ లో సరదాగా గడుపుతున్నారు. ఈ వెకేషన్ కు ఓ ప్రత్యేకత ఉంది. 10 ఏళ్ల వెడ్డింగ్ యానవర్సరీ సందర్భంగా లోకేష్ ఈ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. దానికి సంబందించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తన కొడుకు దేవాన్ష్, భార్య బ్రాహ్మిణి లతో ఉన్న చిత్రాలని పోస్ట్ చేసి కుటుంబంతో గడపడం కన్నా సంతోషం ఏముంటుంది అని తెలిపారు. తన కొడుకు దేవాన్ష్ ని భుజాలపై మోస్తున్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఇక రాజకీయాల్లో మంత్రి పదవిని పొందిన లోకేష్ చంద్రబాబు వారసుడిగా తన మార్క్ ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments