నారా-మెగా కోడ‌ళ్ల ఫ్రెండ్షిప్‌ వెన‌క సీక్రెట్ లీక్‌!?

Tuesday, December 5th, 2017, 05:40:41 PM IST

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు బ్రాహ్మ‌ణి, మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు ఉపాస‌న‌ల మ‌ధ్య స్నేహం వెన‌క టాప్ సీక్రెట్ ఏంటి? ప్ర‌స్తుతం ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఇటీవ‌లి కాలంలో ఉన్న‌ట్టుండి మొల‌కెత్తిన న‌యా ఫ్రెండ్షిప్ ఇది. ఉన్న‌ట్టుండి స్నేహితుల‌య్యారు. కానీ ఆ త‌ర్వాత ప‌బ్లిక్ అప్పియ‌రెన్సుల‌తో దుమ్ము రేపేశారు. బ్రాహ్మ‌ణి సామాజిక కార్య‌క‌లాపాల‌కు ఉపాస‌న మ‌ద్ధ‌తు ప‌లికారు. బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆస్ప‌త్రిలో సామాజిక కార్య‌క్ర‌మం, అటుపై మొన్న‌టి హైటెక్స్‌- బిజినెస్ స‌మ్మిట్ మొద‌లుకుని ప్ర‌తిచోటా ఆ ఇద్ద‌రూ క‌లిసే క‌నిపించి హ‌డావుడి చేయ‌డం వెన‌క అస‌లు సీక్రెట్ ఏంటి? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. కోడ‌ళ్లిద్ద‌రి స్నేహం వెన‌క టాప్ సీక్రెట్ ఏమై ఉంటుంది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఈ స్నేహం వెన‌క పొలిటిక‌ల్ యాంగిల్ ఉంద‌ని, నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపు, దూర‌పు చూపు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. మెగా ఫ్యామిలీతో రిలేష‌న్ షిప్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేదేపాకి క‌లిసొస్తుంద‌నేది బాబు ఆలోచ‌న అట‌. అప్ప‌టిక‌ప్పుడు సెట్టింగ్ కుద‌ర‌దు కాబ‌ట్టి, చాలా ముందుగానే ఈ టెక్నిక్‌ని ఉప‌యోగిస్తున్నారని, ఆర్నెళ్ల ముందే బాబు ప్లాన్ చేశారంటే దీనివెన‌క చాలానే పెద్ద క‌థ ర‌న్ అవుతోంద‌ని చెబుతున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో అనుబంధం పెంచుకునే ఆలోచ‌న‌లో బాబు ఉన్నార‌ని విశ్లేషిస్తున్నారు. అయితే అన్నిటికీ స‌మాధానం ఎన్నిక‌ల ముందే దొరుకుతుంది. అంత‌వ‌ర‌కూ నారా – మెగా కోడ‌ళ్ల స్నేహ‌బంధం ఇలానే వెల్లి విరియాల‌ని కోరుకుందాం.

  •  
  •  
  •  
  •  

Comments