వైఎస్‌ జ‌గ‌న్ పై మ‌రోసారి.. నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Saturday, October 27th, 2018, 03:03:10 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై హ‌త్యాయ‌త్నంలో భాగంగా కోళ్ళ‌కు క‌ట్టే క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో దాడి జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ పోలీసులకైతే స్టేట్‌మెంట్ ఇస్తాన‌ని.. ఏపీ పోలీసుల పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని జ‌గ‌న్ నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ మ‌రోసారి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌రుస ట్వీట్లు చేస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపాడు.

త‌మ కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించ‌డం క‌రెక్ట్ కాద‌ని లోకేష్ అన్నారు. అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థల పై త‌న‌కు నమ్మకం లేదంటూ జ‌గ‌న్ మాట్లాడ‌డం చాలా దారుణ‌మ‌ని లోకేష్ తెలిసారు. అంత‌టితో ఆగ‌ని లోకేష్.. అడ్డంగా దొరికిపోయిన తర్వాత‌ కూడా ఏ1 ముద్దాయి అయిన జగన్ దొంగ, దొంగ అని అరుస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇక అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్‌లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన.. కోడి కత్తి నాట‌కం వెనుక ఉన్న నిజాలు మార‌వ‌ని లోకేష్ వ‌రుసగా చేసిన ట్వీట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మ‌రి లోకేష్ ట్వీట్ల‌కి వైసీపీ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments