“దక్షిణాది రాష్ట్రల మీద దృష్టి పెట్టనున్న నరేంద్రమోదీ – అమిత్ షా ”

Wednesday, September 5th, 2018, 11:50:08 AM IST

గడిచిన నాలుగు ఏళ్లలో కొద్ది రాష్ట్రాల మినహాయించి మిగతా మన దక్షిణాది రాష్ట్రాలు అన్ని కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నాయనడం లో ఎలాంటి సందేహం లేదు.. దీని దృష్ట్యా నే బి.జె.పీ ప్రభుత్వం మన దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయం లో ఉన్న విధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు లేవు అంతే కాకుకండా లోక్ సభ సీట్ల విషయం లో కూడా కాషాయ పార్టీ కి ఇతర రాష్ట్రాల్లో కొన్ని సీట్లను గెలిచినా 2019 ఎన్నికలకు ఆ బలం వారికి సరిపోదు అని వారికి అర్ధం అయ్యింది. కేంద్రం లో కానీ అటు మళ్ళీ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీయే కావాలన్న సరే వారికి సరైన బలగం కావాలి. ఇప్పుడున్న పరిస్తుతుల్లో అది కొంచెం కష్టం అనే సందిగ్ధం లో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది..

అంతే కాకుండా మన దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎలాగో వారికి తెలుసు కావున నరేంద్ర మోడీ మరియు అమిత్ షా తమిళనాడు, తెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ తీస్కుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణా రాష్ట్రం లో భారతీ జనతా పార్టీ బలం గానే ఉందని ఇక్కడి పార్టీ సభ్యులు నమ్ముతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 2014 ఎన్నికల సమయం లో మిత్ర పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొన్ని కారణాల వాళ్ళ ఎన్డీఎ నుంచి విడిపోయింది దీనితో వారు తర్వాతి వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఐతే ఎక్కువ సీట్లు వస్తాయో వారితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని తెలుస్తుంది. అదే విధంగా ఉత్తర భారతదేశం లా దక్షిణ భారతదేశం అంతటా కూడా వారి జెండాని ఎగురవేయాలని ఇతర పార్టీలతో చెలిమిగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వేచి చూడాలి మరి వారి వ్యూహాలు ఎంత వరకు పనిచేస్తాయో..

  •  
  •  
  •  
  •  

Comments