మోడీకి సొంతంగా ఓ కారు కూడా లేదట?

Wednesday, September 19th, 2018, 10:00:23 AM IST

భారతదేశ ప్రధాన మంత్రి మోడీకి కనీసం సొంతంగా ఒక కారు కూడా లేదా? అంటే నమ్మడం కొంచెం కష్టమే గాని ఫైనల్ గా అది నిజం. పీఎంఓ మోడీ ఆస్థి వివరాలను ప్రజల ముందు ఉంచింది. అందుకు సంబందించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రముఖుల ఆస్తివివారాలను తెలుసుకునేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక మోడీ ఆస్తి వివారాల విషయానికి వస్తే.. మార్చి 31,2018 వరకు ఉన్న లెక్కల ప్రకారం మోదీ ఆస్తుల విలువ రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉందట.

మోడీ వద్ద ప్రస్తుతం 50 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయట. ఇక వివిధ బ్యాంకుల్లో కోటి రూపాయల వరకు ఉన్నట్లు పిఎంఓ పేర్కొంటు.. ఆయనకు సొంతంగా ఒక కారు, బైకు కూడా లేదని వివరించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే.. 2002లో 1,30,488 రూపాయలకు గాంధీనగర్‌లోని ఓ నివాస గృహం కొనుగోలు చేశారు. అనంతరం దానిపై 2,47,208 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం దాని విలువ కోటిరూపాయలకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

పీఎంవో వెల్లడించిన వివరాలు:

మోదీ వద్ద ఉన్న నగదు- రూ. 48,944
బంగారం విలువ(కేవలం 4 ఉంగరాలు) – రూ.1,38,060
జాతీయ పొదుపు పత్రం బాండ్‌ విలువ- రూ. 5,18,235
గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌- రూ.11,29,690
ఎస్బీఐ అకౌంట్‌లో- రూ.1,07,96,288
ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రా బాండ్‌- రూ. 20,000
జీవిత బీమా పాలసీ- రూ. 1,59,281