న‌రేంద్ర‌ మోదీ బ‌యోపిక్ క‌న్ఫామ్‌?

Wednesday, June 6th, 2018, 12:23:29 PM IST


ఇండియాలో డిజిట‌ల్ విప్ల‌వం తేవ‌డమే ధ్యేయంగా న‌రేంద్ర మోదీ చేపట్టిన సంస్క‌ర‌ణ‌ల‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోసేందుకు చూస్తుంటే, అందుకు పూర్తి భిన్నంగా ప్ర‌జ‌లు ఓట్ల రూపంలో తీర్పునిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. భాజ‌పాకు సంస్క‌ర‌ణ‌లు ప్ల‌స్ అయ్యాయ‌న్న వాద‌న ఓవైపు వినిపిస్తుంటే, మ‌రోవైపు వాస్తవ ప్ర‌పంచం వేరేగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు అంతే మిన్నంటుతున్నాయి. నోట్ల ర‌ద్దు ప‌ర్య‌వ‌సానం ఇప్ప‌టికీ ప‌లు రంగాల‌పై తీవ్రంగానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి తోడు జీఎస్టీ స‌మ్మెట పోటు ఓ రేంజులో ప్ర‌జ‌ల‌పై ప‌డింద‌న్న‌ది జీర్ణించుకోలేని నిజం. మొత్తానికి మోదీ ప్ర‌భుత్వం సాధ్యాసాధ్యాల మ‌ధ్య త‌మ‌ని తాము స‌మ‌ర్థించుకుంటూ ప‌బ్బం గ‌డుపుతోంది.

ఇక‌పోతే ఒక ఛాయ్ వాలా నుంచి దేశానికే ప్ర‌ధాని అయ్యేంత వ‌ర‌కూ న‌రేంద్ర మోదీ జీవితం ఆషామాషీ కాదు. అత‌డు ఎన్నో పోరాటాలు చేసి ఆ స్థాయికి ఎదిగారు. హిందూత్వ అండ‌తో అత‌డు దేశంలోని హిందూయిజాన్ని ప‌రిర‌క్షించేవాడిగా కొన‌సాగుతున్నాడు. అలాంటి మోదీ జీవితాన్ని వెండితెర‌కెక్కిస్తారు అన‌గానే ఒక‌టే ఉత్కంఠ‌. ఎన్నో భావోద్వేగాల‌కు ఈ సినిమా ఆల‌వాలం కానుంది. అయితే ఈ చిత్రంలో ఎవ‌రు టైటిల్ పాత్ర‌లో క‌నిపిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు ఇంత‌వ‌ర‌కూ. మోదీ పాత్ర‌లో కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టిస్తార‌ని టాయ్‌లెట్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌క‌టించారు. ఆ త‌ర‌వాత అనుప‌మ్ ఖేర్‌, ప‌రేశ్ రావ‌ల్ పేర్లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప‌రేష్‌ని ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయ్యింద‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో ఇక అత‌డే మోదీ బ‌యోపిక్ టైటిల్ పాత్ర‌ధారి అని చెప్పుకుంటున్నారు. ఇక‌పోతే శ‌త్రుఘ్న సిన్హా త‌న ఫేవ‌రెట్ మోదీ పాత్ర‌లో న‌టిస్తాన‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించిన సంగ‌తిని గుర్తు చేసుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments