నరేంద్ర మోడీకి ఆంధ్రలో అడుగు పెట్టే దమ్ము,ధైర్యం లేదు..!

Wednesday, October 3rd, 2018, 11:35:37 AM IST

2014 నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల వరకు బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీలు బాగానే చెట్టపట్టాలు వెస్కొని తిరిగారు.కానీ బీజేపీ వారు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి మరియు వారు ఇచ్చిన విభజన హామీలను గురించి గాని ఏ మాత్రం పోరాటం చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది దీనితో టీడీపీ,బీజేపీలు విడిపోయాయి.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరు పార్టీల మధ్యలో పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటుంది.ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు.

అదే విధంగా ఈ రోజు జరిగిన ఒక చర్చలో టీడీపీ మరియు బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.టీడీపీకి సంబందించిన యామిని గారికి మరియు బీజేపీ నాయకులు లక్ష్మీపతి రాజాల మధ్య తీవ్ర తారా మాటల యుద్ధం జరిగింది.ఆవిడ మాట్లాడుతూ బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన ద్రోహానికి గాను మీ ప్రధాన మంత్రి మొహం చూపించుకోలేకపోతున్నారు అని,ఆయనకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే దమ్ము ధైర్యం లేదని ఘాటైన విమర్శలు చేశారు దీనితో ఈ ఇరువురిలో తీవ్ర వాగ్వాదం మొదలయ్యింది.