రాఫెల్ కుంభకోణంలో మోడీ,అంబానీతో కలిసి బ్రోకరైజ్ చేసాడు..!

Wednesday, October 24th, 2018, 04:39:53 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం వారు అగ్రి గోల్డ్ బాధితులకు దొంగ లెక్కలు చూపించి డబ్బులు దోచేస్తున్నారని,గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ నేతలు వారిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసినదే,అయితే ఇప్పుడు బీజేపీ నేతలు అందరు దొంగ దీక్షలు చేస్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీల వారు మండిపడుతున్నారు.బీజేపీ పార్టీ నేతలు కావాలనే ఎన్నికల ముందు డబ్బా కొట్టుకోవడానికే ఇలా దొంగ నిరాహార దీక్షలు చేస్తున్నారని సిపిఐ పార్టీ నాయకుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి, బీజేపీ పార్టీ నాయకుల మీదనే కాకుండా అక్కడ కేంద్రం లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో కోసం ఎంత చర్చ జరిగిందో అందరికి తెలుసు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రమేయం ఈ కుంభకోణం లో ఉందని రామకృష్ణ తెలిపారు.అంతే కాకుండా మోడీ అనీల్ అంబానీతో కలిసి ఆయనకీ ఈ కుంభకోణంలో కూడా బ్రోకరైజ్ చేసాడని మండిపడ్డారు.30 వేల కోట్ల రూపాయలు అనీల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికి మోడీ ఈ దేశ ప్రజలకు అన్యాయమా చేసాడని మండిపడ్డారు.