బిజెపి ప్రచార సారధిగా మోడీ

Sunday, June 9th, 2013, 02:16:36 PM IST

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రానున్న ఎన్నికలకు బిజెపి ప్రచార సారధిగా ఎంపికయ్యారు. బిజెపి ప్రచార సారధిగా నరేంద్ర మోడీ పేరును బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనితో బీజేపీలో మోడీ శకం మొదలయినట్టేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సమావేశంలో అధ్యక్షుడు రాజ్ నాథ్ తో సహా చాలా మంది నేతలు మోడీకి సానుకూలంగా ఉన్నారు.

మోడీని ప్రచార కమిటీ చైర్మెన్ కాకుండా కన్వీనర్ గా ప్రకటిస్తే తనకేమీ అభ్యంతరం ఏమీ లేదని అధ్వాని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో బిజెపి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అద్వానికి మింగుడు పడని అంశమే అంటున్నారు. అయితే మోడీ పేరు ప్రకటిస్తే ఇతర పక్షాలు దూరమయ్యే ప్రమాదం ఉందంటూ అద్వాని వ్యతిరేకించారు. ఇదే కారణంతో తొలిసారి పార్టీ కార్యవర్గ సమావేశాలకు అద్వాని దూరంగా ఉన్నారు.